ఎన్టీఆర్ నీల్ : ఆ వార్తల్లో నిజం లేదు – మేకర్స్ 

Makers Deny Rumours Around NTR–Neel Project

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్ ) గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ రద్దు అయిందని, ఎన్టీఆర్ లుక్ విషయంలో సంతృప్తిగా లేకపోవడంతో షెడ్యూల్స్ నిలిపివేశారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, సినిమా పనులు పక్కా ప్లాన్ ప్రకారమే సాగుతున్నాయని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం కనిపిస్తున్న చిన్న విరామం కేవలం తదుపరి భారీ షెడ్యూల్ కోసం అవసరమైన సన్నాహాల కోసమే తప్ప, మరే ఇతర కారణాలు లేవని తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని, అభిమానులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఏదైనా సమాచారం ఉంటే అధికారికంగా తామే వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.

ఇప్పటికే జోర్డాన్ వంటి ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా యుద్ధ విద్యల్లో శిక్షణ పొందడమే కాకుండా, తన బాడీ లాంగ్వేజ్‌ను కూడా పూర్తిగా మార్చుకుంటున్నారు. కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై అటు టాలీవుడ్, ఇటు శాండల్‌వుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చిన ఈ వివరణతో గత కొద్దిరోజులుగా సాగుతున్న సందిగ్ధతకు తెరపడింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.