యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద డెకాయిట్ గర్జన

Dacoit Makes a Mark at the USA Box Office

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘డెకాయిట్: ఒక ప్రేమ కథ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం, యూఎస్ఏ లో ఈ చిత్రం ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే $100K (సుమారు ₹83 లక్షలు) మార్కును దాటేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏప్రిల్ 9న గ్రాండ్‌గా జరగనున్న యూఎస్ఏ ప్రీమియర్స్ కోసం టికెట్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. మోక్ష మూవీస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో విడుదల చేస్తోంది. అడివి శేష్ గత చిత్రాలైన ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి సినిమాలు అక్కడ మంచి వసూళ్లను సాధించడంతో, ‘డెకాయిట్’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం రెండు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఒక కీలక పాత్రలో నటించగా , జైన్ మేరీ ఖాన్ , కామాక్షి భాస్కర్ల ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. షానీల్ డియో దర్శకత్వంలో వస్తున్న ఈలవ్ & యాక్షన్ డ్రామాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.

ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ మరియు అడివి శేష్ – మృణాల్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ క్రేజీ అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రధాన కారణం. ఏప్రిల్ 10న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.