మైసా నుండి రష్మిక మందన్న బర్త్ డే స్పెషల్ ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్

Intense Birthday Poster of Rashmika Mandanna from Mysaa Released

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఫీమేల్ -సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మైసా. దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆకట్టుకున్న టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌లు, టీజర్ తో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పోస్టర్‌లో రష్మిక గాయాలతో నిండిన, యుద్ధం చేసినట్లుగా కనిపించే లుక్‌లో కనిపిస్తోంది. ఆమె ముఖం మీద మట్టి, పొగ, రక్తపు మరకలు కనిపిస్తుండగా, ముక్కు, చెంపలు, నుదుటిపై ఉన్న గాయాలు ఆమె పాత్ర ఎదుర్కొన్న క్రూరత్వాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అయినప్పటికీ, ఆమె కళ్లలో కనిపించే ఆగ్రహం, తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆ పాత్రకు అవసరమైన రా ఫెరోసిటీని అద్భుతంగా ప్రతిబింబిస్తోంది.

గొండ్ తెగల సాంస్కృతిక నేపథ్యంతో తెరకెక్కుతున్న “మైసా” సినిమాలో రష్మికను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా, ఓ శక్తివంతమైన గొండ్ మహిళగా కనిపించనున్నారు. ఎమోషన్స్, హై-ఆక్టేన్ యాక్షన్ మేళవింపుతో, ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.సినిమాటోగ్రఫీని శ్రేయాస్ పి కృష్ణ అందిస్తుండగా, జేక్స్ బీజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ యాక్షన్ సీక్వెన్సులను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.