గతంలో మలయాళ-తమిళ ద్విభాషా థ్రిల్లర్ మమ్ముట్టి ‘స్ట్రీట్ లైట్స్’కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్, ఇప్పుడు ‘చౌర్య పాఠం’లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా నటిస్తున్న ఈ కొత్త చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వి. చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2 గా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. ‘డోంట్ స్లీప్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్, “The longer you sleep, the closer he gets” అనే ట్యాగ్‌లైన్ క్యురియాసిటీని పెంచింది. ఫస్ట్-లుక్ పోస్టర్ లో రవీంద్ర విజయ్ పాత్ర, తుపాకీతో మంచు పర్వతాల మీదుగా ఇంద్ర రామ్‌ను వెంబడిస్తుండగా, ముందు భాగంలో హీరో కళ్ళు మూసుకుని, నుదుటిపై కట్టుతో కనిపించడం ఆసక్తికరంగా ఉంది.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి పనిచేసిన మోనికా-రామకృష్ణ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని గోకుల్ హర్షన్ అందించారు, ఈయన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఒక ప్రాజెక్ట్‌కు కూడా సంగీతం అందిస్తున్నారు. స్టేట్ అవార్డు గ్రహీత అయిన మనోజ్ ఎడిటింగ్ చేశారు. గతంలో RDX , దుల్కర్ సల్మాన్ నటించిన ఐయామ్ గేమ్ చిత్రాలకు పనిచేసిన సజీర్, లూనా కథను అందించారు.
తెలుగు కథనానికి బలమైన మలయాళ టెక్నికల్ కోర్ సపోర్ట్‌గా ఉండటం ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇది రెండు పరిశ్రమల మధ్య పెరుగుతున్న స్నేహాన్ని ప్రజెంట్ చేస్తోంది. మలయాళ సినిమాల డెప్త్, డీటైల్‌ను, తెలుగు సినిమాల స్కేల్, రీచ్‌తో కలిపిన వినూత్న ప్రయత్నం.
ఎమోషనల్ గా టెక్నికల్‌గా ఈ చిత్రం గొప్ప సైకాలజికల్ థ్రిల్లర్ అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతుంది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























