వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా దిల్ రాజు గారు ఇచ్చిన ఆఫర్ నాకు చాలా నచ్చింది. అయితే ప్రదీప్ హీరోగా ఆయన నిర్మాణంలో సినిమా చేస్తే నేను కచ్చితంగా చేస్తాను. ప్రస్తుతం అలాంటి ప్లాన్స్ లేవు, హ్యాపీగా డైరెక్షన్ చేసుకుంటున్నాం (నవ్వుతూ). ఈ సినిమా ప్రొడ్యూసర్ నయనతార గారు. మేము రీసెంట్ “శంకర్ వరప్రసాద్” సినిమా కోసం వర్క్ చేశాం. ఆమె చాలా హంబుల్ పర్సన్. విగ్నేష్ గారు నయన్ గారు చూపించిన ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేను.ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. విగ్నేష్ గారు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ నాకు ప్రత్యేకంగా చూపించారు. డబ్బింగ్ గురించి మర్చిపోయి సినిమా ఎంజాయ్ చేశాను. సినిమా చాలా న్యూ ఏజ్ కంటెంట్‌తో ఉంది. 2040లో మనం టెక్నాలజీ మీద ఎంత డిపెండ్ అవుతామో చాలా ఇన్నోవేటివ్‌గా చూపించారు. ప్రదీప్ అద్భుతంగా నటించాడు. ఎస్.జె. సూర్య గారు మరో హైలైట్. ట్రైలర్లో చూపింది చాలా తక్కువే. థియేటర్స్‌లో సినిమా మామూలుగా వుండదు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. కృతి ఈ సినిమాలో ఎక్స్ట్రార్డినరీగా నటించింది. ప్రదీప్ అందరికీ నచ్చే హీరో. ఎందుకంటే అతను మనలో ఒకడిలా అనిపిస్తాడు. అతని నటన చాలా రియల్‌గా ఉంటుంది. అందుకే అతనికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తున్నాయి. ఈ సినిమా కూడా అతని కెరీర్లో మరో పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























