వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్ లేదా చాట్ జీపీటీని అడుగుతున్నాం. మన రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం—అన్నింటికీ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. కానీ ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం అంతా సరైనదేనా? ఇద్దరి మధ్య జరిగేదాన్ని వాళ్లిద్దరికే తెలుసు, కానీ చాట్ జీపీటీకి తెలియదు. ఇప్పుడు 2026లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, 2040లో ఎలా ఉంటుంది? మనుషుల కంటే మిషన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. మిషన్ ఎవరి పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది.అలాంటి పరిస్థితిలో..ఒక అప్లికేషన్ మనకి సరైన పార్ట్నర్ ఎవరో చెబితే? దానిపై ప్రేమను నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ సినిమాలో చూపించిన విషయాలు చాలా రిలేటబుల్‌గా ఉంటాయి. అదే సమయంలో కమర్షియల్‌గా కూడా చెప్పాం లవ్, కామెడీ, సాంగ్స్ అన్నీ ఉంటాయి. అనిరుద్ గారితో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. విగ్నేష్ గారు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. కృతి ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఈవెంట్‌కు వచ్చిన దిల్ రాజు గారు, అనిల్ గారికి థాంక్స్. తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన ప్రేమ మాటల్లో చెప్పలేను. టీజర్‌లో నా సొంత వాయిస్ ఉంది. పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను స్వయంగా డబ్బింగ్ చెప్తాను. ఏప్రిల్ 10న థియేటర్స్‌లో కలుద్దాం!
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























