తమ్ముడు తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ మళ్ళీ సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నాడు. నిన్న తన బర్త్ డే సందర్భంగా నితిన్ తన తదుపరి చిత్రాల గురించి అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఓ సినిమాను ‘ఆయ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు అంజి కె. మణిపుత్రతో చేయబోతున్నట్లు అధికారికంగా ఖరారైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఆయ్’ చిత్రంతో గోదావరి యాస, అక్కడి వినోదాన్ని అద్భుతంగా పండించిన అంజి మణిపుత్ర చెప్పిన కథకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని నితిన్ సోదరి నిఖితా రెడ్డి భారీ వ్యయంతో నిర్మించనున్నారు.ఇది పూర్తిస్థాయి రూరల్ కామెడీ ఎంటర్టైనర్ అని సమాచారం. ‘ఆయ్’ తరహాలోనే ఇందులోనూ హిలేరియస్ కామెడీతో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ కథ కూడా గోదావరి జిల్లా నేపథ్యంలోనే సాగుతుందని, నితిన్ ఒక కొత్త మాస్ అండ్ ఫన్నీ అవతారంలో కనిపిస్తారని సమాచారం.
ఇక నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘భీష్మ’, ‘రంగ్ దే’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే బ్యానర్‌లో నితిన్ హీరోగా మూడో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు కొత్త దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























