సల్మాన్ సరసన నయనతార.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్

Salman Khan – Nayanthara in Vamshi Paidipally Directorial

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. నిన్న ఈసినిమాను అధికారకంగా ప్రకటించారు.ఇక ఈరోజు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ భారీ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా నయనతారను తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. “ద క్వీన్ అరైవ్స్” అంటూ చిత్ర యూనిట్ నయనతారను ఈ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానిస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ తర్వాత హిందీలో నయనతార నటిస్తున్న రెండవ చిత్రమిది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 2026 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఈద్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇది ఒక హై-వోల్టేజ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, ఇందులో ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయని సమాచారం. సల్మాన్ ఖాన్‌ను మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్‌ఫుల్ రోల్‌లో వంశీ పైడిపల్లి చూపించబోతున్నారట.

గతంలో సల్మాన్ ఖాన్, నయనతార కలిసి చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో కనిపించినప్పటికీ, ఒక పూర్తిస్థాయి చిత్రంలో వీరు జంటగా నటించడం ఇదే మొదటిసారి. ఈ ఇద్దరు స్టార్స్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.