రాజస్థాన్ లో వృషకర్మ నెక్స్ట్ షెడ్యూల్

Vrushakarma Moves to Rajasthan for Its Next Schedule

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న 24వ సినిమా వృషాకర్మ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రేపు ఈసినిమా కొత్త షెడ్యూల్ రాజస్థాన్‌ లో ప్రారంభం కానుంది. ఇందులో భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరించనునున్నారు. ప్రారంభించబోతోంది. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా కొంతమంది విదేశీ స్టంట్ మాస్టర్లను కూడా రప్పించినట్లు సమాచారం.ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచి, సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ చిత్రంలో నాగచైతన్య అర్జున్ అనే ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపిస్తుండగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌గా, సీనియర్ నటుడు జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈసినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.