భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే.. ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి.. అదీ తెలిసినోడికి ఓబీ రుచి చూపించాలి.. అప్పటికీ లొంగకపోతే ఆడి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి.. మనకి కావాల్సింది దక్కించుకోవాలి’.. అంటూ మొదలైన ఈ టీజర్లో అన్ని రకాల ఎమోషన్స్ చూపించారు.
మాస్ ఆడియెన్స్‌కి నచ్చే యాక్షన్ సీక్వెన్స్, యూత్ మెచ్చే లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నీ టీజర్లో ఉన్నాయి. ఇక అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకోబోతోన్నామని ఈ టీజర్‌తో టీం చెప్పకనే చెప్పేసింది. ఈ టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, మ్యూజిక్ ఇలా అన్నీ కూడా రా అండ్ రస్టిక్‌గా ఉన్నాయి. ప్రేమ కథ కూడా చాలా కొత్తగా ఉండబోతోన్నట్టు అనిపిస్తోంది. మరి ఈ అనకాపల్లి కథ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, దేవ్ జండ్ సంగీత దర్శకుడిగా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ సమ్మర్లోనే మూవీని రిలీజ్ చేయబోతోన్నారు.
తారాగణం: విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, మరియు సంగీత క్రిష్
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























