బైకర్ లో తన ట్రాన్స్‌ఫర్మేషన్ తో సర్‌ప్రైజ్ చేయనున్న శర్వానంద్

Sharwanand Set to Impress with New Look in Biker

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ మూవీ బైకర్ కోసం అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. వ్యక్తిగతంగా, క్రియేటివ్‌గా తనను మళ్లీ ఛాలెంజ్ చేసే పాత్ర బైకర్ రూపంలో వచ్చింది. ఇందులో అతను 18 ఏళ్ల రేసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం అతను తన శరీరాన్ని, మనసును పూర్తిగా మార్చుకున్నారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా, యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది.ఇప్పటికే మేకర్స్ శర్వా ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోను విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒకసారి కమిట్ అయిన తర్వాత శర్వా పూర్తిగా తనను డెడికేట్ చేశారు. ఉదయం సూర్యోదయం కంటే ముందే మొదలయ్యే రోజు, అలసటతో ముగిసేది. లాంగ్ డిస్టెన్స్ పరుగులు, కఠినమైన స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మొబిలిటీ సెషన్స్‌తో అతను తన పరిమితులను దాటాడు. ఇది కేవలం శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఛాలెంజ్ గా మారింది.

https://twitter.com/baraju_SuperHit/status/2038233332249682260?s=20

ఈ ప్రయాణంలో యోగా అతనికి కీలకంగా నిలిచింది. జిమ్ అతనికి బలం, సహనం ఇచ్చినప్పుడు, యోగా అతని ఆలోచనలను ప్రశాంతం చేసి, ఫోకస్‌ను పెంచింది. ఈ ఫెరోసిటీ, ప్రశాంతత కలయికే అతని మార్పుకు బలం అయింది. దీంతో అతను బరువు తగ్గి, మరింత షార్ప్ లుక్‌తో పాటు కొత్త కాన్ఫిడెన్స్‌ను పొందారు.బైకర్ ఏప్రిల్ 3 విడుదలకు సిద్ధమవుతుండగా, శర్వా కొత్త అవతార్‌కి అద్భుత స్పందన వస్తోంది.

శర్వా మాట్లాడుతూ.. షూటింగ్ మొదటి రోజు అద్దంలో చూసుకున్నప్పుడు, నేను సిద్ధంగా ఉన్న, క్రమశిక్షణతో ఉన్న, అప్‌డేటెడ్ వ్యక్తిని చూశాను. ఈ ప్రయాణం నాకు ఒక విషయం నేర్పింది..ఎంత నిరాశలో ఉన్నా.. ఒక నిర్ణయం తీసుకుంటే పూర్తిగా మారిపోవచ్చు. ఏప్రిల్ 3న మీరు స్క్రీన్‌పై విక్కీని చూస్తే, అది కేవలం నటన కాదు – రెండు సంవత్సరాల కష్టం, మారాలనే పట్టుదల ఫలితాన్నిని చూస్తారు”శర్వా చెప్పినట్లే, తన మార్పు ఒక సందేశం.. ఎంత నిరాశలో ఉన్నా, తిరిగి పైకి రావడం సాధ్యమే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x


మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.