‘బైకర్’ ఏప్రిల్ 3న నేపథ్యంలో హీరో శర్వానంద్ , హీరొయిన్ మాళవిక నాయర్ ,డైరెక్టర్ అభిషేక్ కంకర తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఇప్పటికే ఈ చిత్ర బృందం విజయవాడలోని కనకదుర్గమ్మను కూడా దర్శించుకుంది. సినిమా విడుదలకు ముందు వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్‌తో పాటు సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.అభిలాష్ కంకర ఈసినిమాను డైరెక్ట్ చేయగా గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ఫస్ట్ ఇండియన్ మోటో రేసింగ్ మూవీ గా వస్తున్న ఈసినిమా విజయంపై శర్వానంద్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.
ఇక ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు శర్వానంద్. ఇక ఇప్పుడు బైకర్ తో వస్తున్నాడు. మరి ఈసినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడతాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























