బాలకృష్ణ గారికి అవార్డు రావడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణం – TFPC

Telugu Film Producers Council Hails Nandamuri Balakrishna’s Lifetime Achievement Honor

ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం (International Film Festival Delhi 2026) వేదికగా నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మక ‘జీవన సాఫల్య పురస్కారం’ (Life Time Achievement Award) లభించడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి (TFPC) హర్షం వ్యక్తం చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఢిల్లీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీమతి గుప్తా రేఖ గారి చేతుల మీదుగా ఆయన ఈ గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా టిఎఫ్‌పీసీ గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్ మరియు వై.వి.ఎస్. చౌదరి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

బాలకృష్ణ గారు ఈ అవార్డు అందుకోవడం కేవలం ఆయన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, ఇది యావత్ తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణమని వారు కొనియాడారు. నటుడిగా ఐదు దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న సేవలకు, పోషిస్తున్న వైవిధ్యభరితమైన పాత్రలకు ఈ పురస్కారం తగిన గుర్తింపు అని పేర్కొన్నారు.

భవిష్యత్తులో బాలయ్య బాబు మరిన్ని ఇటువంటి అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ విజయం నందమూరి అభిమానుల్లో మరియు పరిశ్రమ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.