మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మచ్ అవైటెడ్ ‘దృశ్యం 3’ విడుదల తేదీ మారింది. జార్జికుట్టి కుటుంబం చుట్టూ తిరిగే ఈ ఉత్కంఠభరితమైన కథా చిత్రం ఇప్పుడు సరికొత్త తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదట ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. ‘దృశ్యం 3’ ఇప్పుడు మే 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మోహన్‌లాల్ పుట్టినరోజు కూడా అదే డేట్ కావడంతో అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ కానుంది. “గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు… అది కేవలం వేచి ఉంటుంది” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో మోహన్‌లాల్ స్వయంగా ఈ కొత్త విడుదల తేదీని సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు.
గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఓవర్సీస్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్ తమ పాత పాత్రల్లోనే కనిపించనున్నారు. ఇది ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో చివరి భాగం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న హిందీ వెర్షన్ ‘దృశ్యం 3’ అక్టోబర్ 2, 2026న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























