యూత్ ఒక్క రోజు ఆలస్యంగా

Youth Release Postponed by a Day

తమిళనాట ఘనవిజయం సాధించిన ‘యూత్’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. కెన్ కరుణాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తమిళంలో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. ముఖ్యంగా స్కూల్ లైఫ్, స్నేహం మరియు భావోద్వేగాలతో కూడిన కథాంశం కావడంతో అక్కడ యువత ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తెలుగులో ఈ చిత్రం నిజానికి మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ పరంగా ఎదురైన కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదల ఒక రోజు ఆలస్యమైంది. దీంతో ఇప్పుడు ‘యూత్’ తెలుగు వెర్షన్ మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. తమిళంలో కెన్ కరుణాస్ నటనకు, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతానికి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాను తెలుగులో E2C బ్యానర్‌పై హౌస్‌ఫుల్ వినీత్ మరియు సందీప్ విడుదల చేస్తున్నారు.

కెన్ కరుణాస్, అనీష్మా అనిల్ కుమార్, దేవిదర్శిని, సూరజ్ వెంజారామూడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ కీలక పాత్రల్లో నటించిన ఈసినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.పాజిటివ్ టాక్ మరియు యూత్‌ఫుల్ కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం తెలుగులో కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.