ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని రీతిలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్‌లోకి చేరడానికి సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 919 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇందులో భారతదేశం నుండి 687.43 కోట్ల రూపాయలు (గ్రాస్), విదేశీ మార్కెట్ల నుండి 231.57 కోట్ల రూపాయల వసూళ్లు ఉన్నాయి. ఈరోజు లేదా రేపు ఈసినిమా 1000కోట్ల క్లబ్ లో చేరనుంది.
ఈ సినిమా సాధించిన మరో అరుదైన గౌరవం ఏమిటంటే, అతి తక్కువ రోజుల్లో 500 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం ఆరు రోజుల్లోనే భారతదేశంలో 575.67 కోట్ల నికర వసూళ్లను రాబట్టి పాత రికార్డులను తుడిచిపెట్టేసింది. ముఖ్యంగా నార్త్ అమెరికా వంటి ఓవర్సీస్ మార్కెట్లలో భారతీయ సినిమాలకు ముందెన్నడూ లేని విధంగా అత్యధిక వసూళ్లను రాబడుతూ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
ఈ విజయంతో ‘ధురందర్’ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మొదటి భాగం 1300 కోట్లు, రెండో భాగం ప్రస్తుతానికి 919 కోట్లు వసూలు చేయడంతో, ఈ రెండు సినిమాల మొత్తం వసూళ్లు 2200 కోట్ల రూపాయలను దాటాయి. తద్వారా బాహుబలి మరియు పుష్ప తర్వాత 2000 కోట్ల క్లబ్లో చేరిన మూడవ భారతీయ ఫిల్మ్ ఫ్రాంచైజీగా నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం తన మొదటి భాగం సాధించిన 1300 కోట్ల రికార్డును కూడా అధిగమించి, ఆల్ టైమ్ టాప్ 5 ఇండియన్ సినిమాల జాబితాలో చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























