పవన్ సాదినేని ప్రజెంట్స్- తరుణ్ భాస్కర్, కశ్యప్ శ్రీనివాస్, సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ & జీ స్టూడియోస్ యునిక్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్, న్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్ కు కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలాన్ని చేకూరుస్తూ, దిల్ రాజు థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. చిత్రానికి స్ట్రాంగ్ టెక్నికల్ టీం పనిచేసింది. విద్యా సాగర్ చింత సినిమాటోగ్రాఫర్, స్వీకర్ అగస్తి సంగీత దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్ చంద్రిక గొర్రెపాటి, సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందించారు.
రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం గురించి చెప్పారు. పవన్ ని ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అడిగాను. ముందు ఈ టీజర్ చూపించారు. టీజర్ చాలా నచ్చింది. తర్వాత మొత్తం కాన్సెప్ట్ చెప్పారు. నాకు చాలా నచ్చింది. దీంతో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మేము రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాం. కాన్సెప్ట్ చాలా బాగుంది. టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి హ్యూమర్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాని మా ఎస్విసి ద్వారా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నాం. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రమోషన్స్ కి కొత్తగా ప్రయత్నం చేయాలని ఈ ఇలా యూనిక్ గా ఈవెంట్ ని నిర్వహించడం జరిగింది. మే 1 ఈ సినిమా రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దానికి కూడా కండిషన్స్ అప్లై. ఎందుకంటే ఏప్రిల్ 30కి పెద్ది సినిమా ఆల్రెడీ అనౌన్స్ అయింది. ఆ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. ఆ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమాకి థియేటర్స్ మేమే ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కండిషన్స్ అప్లై అని చెప్పాము. మళ్ళీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరమనకుంటే ఒక వారం రోజులు వెనక్కి జరుపుకునే అవకాశం కూడా ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా చేసినందుకు టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























