రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘దేత్తడి’. ఈ ప్రాజెక్ట్ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్లింప్స్ హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పండుగలు, వేడుకలకు ఉత్సాహాన్ని నింపే పాపులర్ డ్రమ్మర్ ఘన్ను భాయ్ వరల్డ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఘన్ను భాయ్, అతని టీం దాదాపు ఏడు కిలోల డ్రమ్ములను మోస్తూ, గంటల తరబడి విరామం లేకుండా ప్రదర్శన ఇస్తూ ప్రశంసలు అందుకున్నారు. ఆ సంగీతం వెనుకకనిపించే ఆత్మగౌరవం, హుందాతనం ఉన్నాయి. ఈ గ్లింప్స్ ఆ విషయాన్ని ఎంతో సున్నితంగా, శక్తివంతంగా ప్రజెంట్ చేసింది.
ఆశిష్ నటన అద్భుతంగా వుంది. అతని రఫ్ మేకోవర్ ఆ పాత్రకు చక్కగా సరిపోయింది. ఆ పాత్రలో ఎంత సహజంగా జీవించారు. అతని హావభావాలు, నేచురల్ ప్రజెన్స్, డ్రింక్ చేసే విధానం, అలవోకగా పలికే హైదరాబాద్ యాస ఈ పాత్రకు బలమైన మాస్ ఫ్లేవర్‌ను జోడించాయి.
ఫస్ట్ టైం డైరెక్టర్ గా ఆదిత్య రావు గంగాసాని కథనాన్ని అద్భుతమైన పట్టుతో నడిపించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్ భారీ స్థాయిలో నిర్మించారు. ఆ స్కేల్ ఈ చిన్న గ్లింప్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్న ప్రసన్న కుమార్ బెజవాడ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా వుండగా, సంగీత దర్శకుడు జునైద్ కుమార్ ఉర్రూతలూగించే డ్రమ్ బీట్స్‌తో పండుగ వాతావరణాన్ని మరింత పెంచారు.
మొత్తం మీద, పర్ఫెక్ట్‌గా కట్ చేసిన ఈ గ్లింప్స్, సినిమా ఏమి అందించబోతోందో స్పష్టంగా ప్రజెంట్ చేసింది. చిత్రం థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోందని సూచిస్తూ.. “జాతర త్వరలో ప్రారంభమవుతుంది,” అని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
‘ది గ్లింప్స్’ అత్యద్భుతంగా లాంచ్ చేశారు. 500 మందికి పైగా స్ట్రీట్ డ్రమ్మర్లు ఏకతాటిపై హోరెత్తిస్తూ, వాతావరణాన్ని ఎనర్జీని నింపేశారు. వారి ఉత్సాహభరితమైన పెర్ఫార్మెన్స్ ఈవెంట్ స్థాయిని పెంచడమే కాకుండా, సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























