ధురంధర్ ది రివెంజ్ 4 డేస్ కలెక్షన్స్

Dhurandhar The Revenge Dominates with Massive 4-Day Collections

ధురందర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్ల సునామి సృష్టిస్తుంది . ఈ చిత్రం విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 761 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కేవలం భారతదేశంలోనే 550 కోట్ల రూపాయల భారీ వసూళ్ల రాబట్టగా ఓవర్సీస్ లో 211 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. పన్నులు మరియు ఇతర ఖర్చులు మినహాయించగా దేశ వ్యాప్తంగా 466 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పెయిడ్ ప్రివ్యూలతో కలిపి మొదటి రోజే 145 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్స్ రాగా, రెండో రోజు 83 కోట్లు, మూడో రోజు 117 కోట్లు వసూలు చేసింది. ఇక నాలుగో రోజున ఏకంగా 121 కోట్ల రూపాయలు రాబట్టడం విశేషం. సాధారణంగా వీకెండ్ తర్వాత వసూళ్లు తగ్గుముఖం పడతాయి, కానీ ఈ చిత్రం నాలుగో రోజున కూడా తన జోరును ప్రదర్శించి సరికొత్త రికార్డులను సృష్టించింది. జియో స్టూడియోస్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తూ ప్రస్తుతానికి అత్యధిక 4 రోజుల కలెక్షన్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమా సంచలనం సృష్టిస్తుంది. తెలుగు వెర్షన్ రెండు రోజులు ఆలస్యంగా విడుదలైనా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది.తెలుగులో ధురంధర్ ది రివెంజ్ ఇప్పటివరకు ఏ హిందీ సినిమా రాబట్టని వసూళ్లను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.