రికార్డు సృష్టించిన ధురంధర్ ది రివెంజ్

Dhurandhar The Revenge Opens Big with Massive Day 1 Collections

రణవీర్ సింగ్ , ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకొని అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రీమియర్లతో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 190కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. అయితే అదే రోజు తెలుగులో విడుదల కాకపోవడం మైనస్ గా మారింది. ఒకేవేళ అనుకున్న ప్రకారం హిందీ తోపాటు అన్ని భాషల్లో విడుదలై ఉంటే కలెక్షన్స్ 300 కోట్ల మార్క్ ను దాటేదే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేవలం ఇండియాలోనే ఈసినిమా 100 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రంతో పోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వల్ల సౌత్ ఇండియాలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది.ఈరోజు నుండి తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో అందుబాటులోకి రానుంది . దాంతో తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఏ హిందీ సినిమాకు రాని కలెక్షన్స్ ధురంధర్ ది రివెంజ్ కు రానున్నాయి.

సినిమాకు ‘పాజిటివ్’ టాక్ రావడంతో ఈ వీకెండ్ ముగిసేసరికి ఈసినిమా 500కోట్ల క్లబ్ లో చేరనుంది.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా 2000కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.