స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ ‘హ్యాపీ రాజ్’. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ఇటివల విడుదలైన ఫస్ట్ సింగిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్స్ శివ నిర్వాణ, వెంకీ అట్లూరి ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో జివి ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. వెంకీ గారు, శివ గారు ఈ వేడుకకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని సోషల్ మీడియాలో లాంచ్ చేసిన రవితేజ గారికి థాంక్యూ సో మచ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను చూశారు. వాళ్లకి చాలా నచ్చింది. మైత్రి మూవీ మేకర్ మైత్రి మూవీస్ ద్వారా ఈ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫన్ కమర్షియల్ మెంట్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది. సినిమా చూసిన తర్వాత ఆ ఈ కథ మీ మనసులను హత్తుకుంటుంది. చాలా స్పెషల్ ఫిలిం. మీరందరూ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో. ఈ సినిమా చూసిన తర్వాత ఫాదర్ ని సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. చాలాకాలం నిలిచిపోతుంది. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























