మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేసిన ముందస్తు షోలు (ప్రీమియర్లు) నిలిపివేయబడ్డాయి. దీనికి ప్రధాన కారణం సెన్సార్ పనుల్లో జరిగిన ఆలస్యం మరియు కంటెంట్ డెలివరీలో తలెత్తిన సాంకేతిక సమస్యలని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన KDM ఫైల్స్ థియేటర్లకు సకాలంలో అందకపోవడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఒక్క తెలుగు వెర్షన్ మాత్రమే కాదు ఇతర డబ్బింగ్ వెర్షన్ ల ప్రీమియర్లు కూడా రద్దయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి భాగం ధురంధర్ భారీ విజయం సాధించడంతో ఈ సీక్వెల్ పై అన్నిభాషల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అందుకు తగ్గట్లే ప్రీమియర్ల షో ల కోసం భారీగా టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే కంటెంట్ రాకపోవడంతో ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో జరగాల్సిన పెయిడ్ ప్రీమియర్లు రద్దయ్యాయి. టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బులు వాపస్ చేయనున్నట్లు థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి.ఇక ప్రీమియర్లు రద్దు కావడంతో టికెట్లు బుక్ చేసుకున్న వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రీమియర్లు రద్దయినప్పటికీ, రేపు ఉదయం నుండి జరగబోయే రెగ్యులర్ షోలకు ఎలాంటి ఆటంకం లేదని సమాచారం. రేపు ఉదయానికల్లా అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కారమవుతాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో మాత్రం హిందీ వెర్షన్ ప్రీమియర్లు మాత్రం యథావిధిగా కొనసాగునున్నాయి.దాదాపు నాలుగు గంటల నిడివి తో ఈసినిమా థియేటర్లలోకి వస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























