స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ ‘హ్యాపీ రాజ్’. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ఇటివల విడుదలైన పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ “అద్దిరా లెక్క” సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ అదిరిపోయే బీట్స్‌తో ఈ సాంగ్‌ని కంపోజ్ చేశారు. గాయకుడు గోవింద్ ప్రసాద్ ఎనర్జీతో పాడిన ఈ పాటకు రెహ్మాన్ రాసిన లిరిక్స్ మంచి వైబ్ తీసుకొచ్చాయి.
ఈ సాంగ్‌లో జివి ప్రకాష్ కుమార్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టెప్స్ అన్నీ కలిసి సాంగ్‌ను మరింత ఎంటర్టైనింగ్గా మార్చాయి.
రిలీజ్ అయిన వెంటనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటూ, ఇన్స్టంట్ హిట్‌గా మారింది.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మధన్ క్రిస్టోఫర్, మ్యూజిక్ జస్టిన్ ప్రభాకరన్, ఎడిటర్ ఆర్కె సెల్వ, ప్రొడక్షన్ డిజైనర్ కుమార్ గంగప్పన్.
హ్యాపీ రాజ్ మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సపోర్ట్ తో ఈ చిత్రం తెలుగులో స్ట్రాంగ్ రన్ అందుకోనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























