సార్ ,లక్కీ భాస్కర్ సినిమాలో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇందులో బలమైన భావోద్వేగాలు ఉంటాయని సమాచారం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జులైలో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా పూర్తికాగానే వెంకీ అట్లూరి డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన ఒక భారీ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఇది ఒక పీరియడ్ డ్రామా లేదా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్ ఫార్మాట్లో కథను మరింత విపులంగా చెప్పే అవకాశం ఉండటంతో, వెంకీ ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
వెంకీ అట్లూరి తన సినిమాల్లో కథా నేపథ్యాన్ని చాలా సహజంగా చూపిస్తారు. మరి నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ఆయన మేకింగ్ స్టైల్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సిరీస్‌లో నటించబోయే ప్రధాన నటీనటుల వివరాలు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ అయ్యాక అధికారికంగా వెల్లడి కానున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























