కొరియన్ కనకరాజు ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్

Korean Kanakaraju Enters Final Shooting Schedule

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. లావిష్ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం హర్రర్, కామెడీని రిఫ్రెషింగ్ క్రాస్-కల్చరల్ ట్విస్ట్‌తో బ్లెండ్ తో తెరకెక్కుతోంది. ఇండియన్, కొరియన్ నేపథ్యాలలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టీం ఇప్పుడు ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ సౌత్ కొరియాలో ప్రారంభించింది. కీలకమైన ఒక వారం రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో పాటలు, కథలో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనున్న ఈ షెడ్యూల్‌ ను కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారు.

వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే అద్భుతమైన స్పందనను అందుకుంది. స్టైలిష్ ప్రెజెంటేషన్, ఎంటర్టైనింగ్ టోన్‌తో వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. ఆ వీడియో ఈ చిత్రంలో ఉండే హిలేరియస్ హారర్-కామెడీ వరల్డ్ ని పరిచయం చేసింది.

ఈ చిత్రానికి సంగీతం ఎస్. తమన్ అందిస్తున్నారు. ఎనర్జీతో నిండిన పాటలతో పాటు ఎంటర్టైనింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సమకూరుస్తున్నారు. ఈ సినిమా కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఇండియాలో ప్రధాన భాగం షూటింగ్ పూర్తి కాగా, ఇప్పుడు కొరియాలో జరుగుతున్న ఈ ఫైనల్ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తికానుంది. అనంతరం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోకి వెళ్ళనుంది.

త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మనోజ్ రెడ్డి కాటసాని, ఎడిటింగ్ సత్యా జి నిర్వహిస్తున్నారు.

వరుణ్ తేజ్ కరిస్మాటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మేర్లపాక గాంధీ హిలేరియస్ స్టొరీ టెల్లింగ్, యూవీ క్రియేషన్స్ – ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలతో ‘కొరియన్ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలో తెలియజేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.