రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన ‘కాంచన’ (ముని 2) సినిమా రీ-రిలీజ్‌లో కూడా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్-కామెడీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యువత భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.నిన్న ఈసినిమా మళ్ళీ రిలీజ్ అవ్వగా మొదటి రోజు ఏకంగా 3.35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టుకుంటుంది.ఒక్క నైజాంలోనే కోటి రూపాయలవసూళ్లను అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హారర్ చిత్రాల విభాగంలో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ‘కాంచన’, రీ-రిలీజ్‌లో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత వచ్చిన హారర్ సినిమా కావడంతో, రీ-రిలీజ్ సినిమాల పరంగా ఇది బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త రికార్డు దిశగా అడుగులు వేస్తోంది.ఈరోజు కూడా బుకింగ్స్ బాగున్నాయి.
టీవీల్లో ఇప్పటివరకు చాలా సార్లు టెలికాస్ట్ అయినా థియేటర్లలో కాంచనకు రీ-రిలీజ్‌లో వస్తున్న స్పందన చూస్తుంటే, ప్రేక్షకులకు ఇప్పటికీ ఈ సినిమాపై ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.
రాఘవ లారెన్స్ నటన , డైరెక్షన్ సినిమాకు మెయిన్ అని చెప్పొచ్చు. ఇందులో లక్ష్మి రాయ్ హీరోయిన్ గా నటించగా ప్రముఖ నటుడు శరత్ కుమార్ షాకింగ్ రోల్ లో కనిపించి అదరగొట్టారు. అలాగే కోవై సరళ , దివ్య దర్శని , శ్రీమాన్ ల కామెడీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. తెలుగులో ఈసినిమాను బెల్లంకొండ సురేష్ విడుదలచేయగా దాదాపు 40కోట్ల గ్రాస్ వసూళ్లతో అప్పట్లో రికార్డు సృష్టించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























