వదలా చివరి వరకు ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు -హీరోయిన్ లయ

Actress Laya Speaks at Vadhala Glimpse Launch Event

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు, బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గ్లింప్స్ ప్రారంభంలో జగపతిబాబు కలవరపరిచే ఆలోచనల్లో మునిగిపోయినట్లు కనిపించారు. ఆ తర్వాత లయ ఎంట్రీ ఇస్తుంది. ఆమె ముఖంలో కనిపించే ఆందోళన, టెన్షన్ కథలోని పరిస్థితులను సూచిస్తుంది.

కథ ఒక్కసారిగా మరింత డార్క్ టోన్‌లోకి మారుతుంది. ఒక మహిళా వాయిస్ ఓవర్ వినిపిస్తూ ”నీ ఫ్యామిలీలో ఒకరిని తీసేసుకుంటా’ అని చెప్పడం షాకింగ్ అల్టిమేటమ్‌ను రివిల్ చేస్తుంది. ఇది వెంటనే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుంది.

షార్ఫ్ కట్స్‌తో యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్ “రేస్ అగైనెస్ట్ టైమ్” అనిపించే టెన్షన్ ని సృష్టిస్తాయి. దర్శకుడు ఆకెళ్ళ వి కృష్ణ సస్పెన్స్‌ను హ్యాండిల్ చేసిన తీరు ప్రత్యేకంగా నిలుస్తుంది.

జగపతి బాబు కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న పాత్రలో కనిపించారు. మరోవైపు లయ కూడా ఇంటెన్స్ వున్న పాత్రలో కనిపిస్తూ కథకు బలాన్ని ఇస్తుంది.

సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు అందించిన డైనమిక్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక టోన్ సెట్ చేతోంది. సంగీత దర్శకుడు కార్తిక్ అందించిన పల్సేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వదలా థీమ్ థ్రిల్‌ను మరింత పెంచుతుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు చేసిన క్రిస్ప్ ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది.

చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల రచన అందించగా, ఆర్ట్ డైరెక్షన్‌ను బజ్జా బ్రహ్మయ్య నిర్వహించారు. మొత్తంగా ఈ ఇంట్రిగింగ్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతూ, టెన్షన్, భావోద్వేగం, థ్రిల్ కలిసిన హై-ఇంపాక్ట్ థ్రిల్లర్‌ను ప్రామిస్ చేస్తోంది.

హీరోయిన్ లయ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. డైరెక్టర్ వంశీ గారు కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి కథ నేనెప్పుడూ కూడా వినలేదు. చివరి వరకు ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు. జగపతిబాబు గారితో మనోహరం సినిమా చేశాను ఆ సినిమా ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. చోట గారు నన్ను అద్భుతంగా చూపించారు ఆయన చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. హృతికా శ్రీనివాస్ ఆముద పాత్రలో చాలా చక్కగా చేసింది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి అలాగే కిషోర్ గారికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.