యంగ్ హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు భోగి చిత్రబృందం సప్రైజ్ ఇచ్చింది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో శర్వానంద్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా ఇంటెన్స్ మరియు రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. గడ్డం,భారీ మీసం మరియు నోట్లో బీడీ తో ఉన్న ఆయన మాస్ మేకోవర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శర్వానంద్ కెరీర్‌లో ఇది 38వ చిత్రం. సంపత్ నంది తనదైన శైలిలో మాస్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో శర్వా గంగ అనే పాత్రలో కనిపించనున్నాడు.
పోస్టర్ ద్వారా ఈ చిత్రం యొక్క విడుదల తేదీని మరోసారి చిత్రబృందం ఖరారు చేసింది. ‘భోగి’ 2026 ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. శర్వానంద్ మార్క్ యాక్టింగ్ మరియు సంపత్ నంది మేకింగ్ స్టైల్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































