ధురంధర్ : ది రివేంజ్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

“Dhurandhar The Revenge Trailer Release Date Locked”

బాలీవుడ్ మచ్ అవైటెడ్ సీక్వెల్ ‘ధురంధర్: ది రివేంజ్’ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుస్తున్నారు.ఇక ఈ ట్రైలర్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. మార్చి 7, 2026 శనివారం ఉదయం 11:01 గంటలకు విడుదల కానుంది. దీనిని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ మరియు సారా అర్జున్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మరియు టి-సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాయి.

2025 చివర్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ధురంధర్’ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.మొదటి రోజే 100కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం. అయితే తెలుగులో అదే రోజు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానుండడంతో ధురంధర్ : ది రివేంజ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.