బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ గత ఏడాది చివర్లో విడుదలై 1400కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది.కేవలం హిందీలోనే విడుదలైన ఈసినిమా రికార్డులను తిరగరాసింది.ఓటీటీలోకి వచ్చాక అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా కు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ధురంధర్ : ది రివేంజ్ టైటిల్ తో ఈ సీక్వెల్ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా నిడివి కూడా మొదటి భాగం లాగే చాలా ఎక్కువగా ఉండబోతోంది. తాజా సెన్సార్ సమాచారం ప్రకారం, ‘ధురంధర్ 2’ రన్ టైమ్ దాదాపు 3 గంటల 40 నిమిషాలు వరకు ఉండవచ్చని తెలుస్తోంది.అదే నిజమైతే బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన సినిమాల్లో ఒకటిగా ‘ధురంధర్ 2’ నిలవబోతోంది. 220 నిమిషాల పాటు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టేంత పవర్‌ఫుల్ యాక్షన్ మరియు ఎమోషన్స్ ఇందులో ఉన్నాయని దర్శకుడు ఆదిత్య ధర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కెజియఫ్ ఫేమ్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంతో పోటీ పడనుంది.: ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యమీ గౌతమ్ ఈ సీక్వెల్‌లో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
మొదటి భాగంలో రెహ్మాన్ డకైత్ అంతం తర్వాత, రణవీర్ సింగ్ పోషించిన హంజా అలీ మజారీ పాత్ర లీడర్ గా ఎలా ఎదిగి తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడు అనే ఇంటెన్స్ పాయింట్‌తో ఈ సినిమా సాగనుంది.సినిమాకు వున్న హైప్ చేస్తుంటే మొదటి రోజే ఈసినిమా 100కోట్ల మార్క్ క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































