మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి కి ట్రెమండస్ రెస్పాన్స్ తో రికార్డులను బద్దలు కొట్టాయి.తాజాగా రామ్ చరణ్ ‘పెద్ది’ డబ్బింగ్ ప్రారంభించారు.
వీడియోలో ”బుచ్చి.. చికిరి పాటలో మోహిత్ చౌహాన్ వాయిస్ కి నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే.. నువ్వు పాడావా ఆయన పాడాడా? అనే డౌట్ వచ్చిందయ్యా.. నాకు డబ్బింగ్ లో కూడా అలా యాక్టింగ్ చేయమని చెప్పకు. డబ్బింగ్ నేనే చెప్పానండి” అని బుచ్చిబాబుతో చరణ్ చెప్పడం నవ్వులు పూయించింది. ఈ వీడియో ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక పెద్ది సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ ఈ రోజు రిలీజ్ కాబోతోంది.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆస్కార్-విజేత స్వరకర్త ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు డీవోపీ, జాతీయ అవార్డు గెలుచుకున్న ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































