అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘డెకాయిట్’ చిత్రం నుండి ఎదురుచూస్తున్న మొదటి పాట “రుబరూ” విడుదలైంది. ప్రేమలోని అసలైన అనుభూతిని, మానవీయ కోణాన్ని ఆవిష్కరించేలా ఈ పాటను రూపొందించారు.లిరికల్ వీడియో కాకుండా ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రుబరూ” సాంగ్ తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదలైంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, చిన్మయి శ్రీపాద తన మధురమైన గొంతుతో ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటకు సాహిత్యం అందించారు.
“ప్రేమ నిజమైనప్పుడు.. అది మనిషిని మళ్ళీ మనిషిగా మారుస్తుంది” అనే లోతైన సందేశంతో ఈ పాటను విడుదల చేశారు. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఉండే గాఢమైన ప్రేమను ఈ పాట ప్రతిబింబిస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ , నటుడు అనురాగ్ కశ్యప్ ,కామాక్షి బాస్కరభట్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.రీసెంట్ గా విడుదలైన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది. ఏప్రిల్ 10న డెకాయిట్ థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































