సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీగౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా వింటారా సరదాగా(VISA). ఈ సినిమా నుండి “అనగ అనగా అమెరికా” అనే మొదటి పాట ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కూడా మంచి స్పందన పొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమెరికాలో స్థిరపడాలనుకునే యువత ఎదుర్కొనే సంఘర్షణలు, వారి ప్రేమకథలను ఈ చిత్రం ఆసక్తికరంగా చూపించబోతోంది.అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ లవ్ స్టోరీ విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల జీవితాలను ప్రతిబింబించేలా ఉండబోతోంది.
ఇందులో యువ నటుడు రాహుల్ విజయ్ ,శివాత్మిక రాజశేఖర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.ఈ సినిమాతో ఉద్భవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























