గత ఏడాది తండేల్ తో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నాగ చైతన్య నెక్స్ట్ వృషకర్మ తో రానున్నాడు. ‘విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ అందించిన కార్తిక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇక ఈసినిమా నుండి ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ మార్చి 5న విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ సినిమా పోస్టర్‌లో నాగచైతన్య రగ్గడ్ మరియు ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు.ఒక గుహ వంటి ప్రదేశంలో టార్చ్ లైట్ పట్టుకొని ఆయన ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.ఇందులో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది. తను ఈసినిమాలో ఆర్కియాలిజిస్టు గా కనిపించనుంది.
సుకుమార్ రైటింగ్స్ మరియు ఎస్విసిసి బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా మేలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నాగ చైతన్య ఈ జోనర్ లో నటించడం ఇదే మొదటి సారి. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























