టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గురువారం (ఫిబ్రవరి 26, 2026) నాడు వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందడిలో ప్రధాని మోదీ పంపిన ఒక అభినందన లేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ తల్లిదండ్రులు మాధవి, గోవర్ధన్ రావులకు పంపిన ఈ లేఖలో ప్రధాని నూతన వధూవరులను దీవించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వివాహానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, విజయ్ మరియు రష్మిక జీవితంలో ఈ కొత్త అధ్యాయం అద్భుతంగా సాగాలని మోదీ ఆకాంక్షించారు. ‘సప్తపది’ విశిష్టతను వివరిస్తూ, వారు జీవితాంతం మంచి స్నేహితులుగా, తోడుగా ఉండాలని ఆశీర్వదించారు.
“విజయ్, రష్మికలకు సినిమాల్లో స్క్రిప్ట్‌లు కొత్తేమీ కాదు. కానీ దేవుడు స్వయంగా రాసిన ఈ రియల్ లైఫ్ స్క్రిప్ట్ వెండితెర మాయాజాలం కంటే మిన్నగా ఉండబోతోంది” అని ప్రధాని తన లేఖలో చమత్కరించడం విశేషం. ఈ మాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఉదయ్‌పూర్‌లోని ‘ITC మోమెంటోస్’ రిసార్ట్‌లో కేవలం 100 మంది సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగుతోంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. మంగళవారం సంగీత్, బుధవారం హల్దీ మరియు మెహెందీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
విజయ్, రష్మికలకు జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘గీత గోవిందం’ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు పెళ్లి పీటల వరకు రావడం అభిమానులకు కనువిందుగా ఉంది. ప్రధాని మోదీ స్వయంగా స్పందించడం వల్ల ఈ వివాహానికి ఒక జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































