నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ‘ది ప్యారడైజ్’ సినిమా నుండి విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ‘మాస్ డ్రగ్’లా వైరల్ అవుతోంది.సాంగ్ విడుదలై 24 గంటలు కూడా కాకముందే అప్పుడే 12 మిలియన్లకు కు పైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే విడుదలైన ఈ పాటకు ఇతర భాషల్లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ తనదైన మార్క్ పవర్‌ఫుల్ బీట్లతో ఈ పాటను కంపోజ్ చేయగా, నాని రగ్గడ్ మాస్ లుక్ మరియు డ్యాన్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.ఓవరాల్ గా భారీ అంచనాలతో విడుదలైన ఈ సాంగ్ ఆ అంచనాలకు మించి రెస్పాన్స్ అందుకుంటుంది. సోషల్ మీడియాలో అయితే ఈ సాంగ్ గురించే చర్చ జరుగుతుంది.కేవలం ఒకే ఒక్క బ్యాంగర్ సాంగ్ తో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 1960ల నాటి గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. భారీ బడ్జెట్ తో సుధాకర్ చెరుకూరి ఈసినిమాను నిర్మిస్తున్నాడు. ఆగస్టు 8న ది ప్యారడైజ్ థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































