ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘కల్కి 2898 AD’ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న ‘కల్కి 2’ షూటింగ్ అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ రెండో భాగం పనులు శరవేగంగా సాగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రధానంగా మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, అక్కడి నుండే కథను కొనసాగిస్తూ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ లో బాలీవుడ్ లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ,లోక నాయకుడు కమల్ హాసన్ పాల్గొంటున్నారు.అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (యాస్కిన్) మరియు ప్రభాస్ (భైరవ/కర్ణ) పాత్రల మధ్య సాగే హై-వోల్టేజ్ డ్రామాగా ఈ సీక్వెల్ తెరకెక్కుతుంది.
వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని మొదటి భాగం కంటే రెట్టింపు బడ్జెట్‌తో మరియు అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తోంది. ఈ రెండో భాగంలో ‘యాస్కిన్’ పాత్రకు సంబంధించిన మరిన్ని రహస్యాలు మరియు కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన మరికొన్ని ఫ్లాష్‌బ్యాక్ సీన్లు ఉంటాయని సమాచారం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























