ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మెగా ఫోన్ పట్టి దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న చిత్రం ‘సరస్వతి’. ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ ట్రైలర్‌ను హీరో నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఒక వైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు మెగాఫోన్ పట్టి ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను వరలక్ష్మి తెరకెక్కించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ విషయానికి వస్తే, ఇది ఒక సస్పెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా అని స్పష్టమవుతోంది. తన కూతురు సరస్వతి స్కూల్ నుండి ఇంటికి రాకుండా మాయమైందని ఆవేదన చెందుతున్న ఒక తల్లి పోరాటమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. “నేనే స్వయంగా స్కూల్లో దించి వచ్చాను, కానీ ఇప్పుడు అక్కడ లేదంటున్నారు” అంటూ వరలక్ష్మి చెప్పే డైలాగ్స్ గుండెకు హత్తుకుంటాయి. అదే సమయంలో ప్రియమణి మరియు కిషోర్ దంపతుల పిల్లలు కూడా మాయమవ్వడం కథలో ఉత్కంఠను పెంచుతోంది.ఆధారం లేని ఈ కేసును టేకప్ చేసే లాయర్ రామానుజం పాత్రలో ప్రకాశ్ రాజ్ తనదైన గాంభీర్యంతో కనిపిస్తున్నారు.
ఈ చిత్రంలో వరలక్ష్మి కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా, ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఆమెతో పాటు ప్రియమణి, ప్రకాశ్ రాజ్, నాజర్, రావు రమేష్, కిషోర్ మరియు రాధికా శరత్ కుమార్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఎస్.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రాన్ని వరలక్ష్మి తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి ‘దోస డైరీస్’ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు.ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మార్చి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























