టూరిస్ట్ ఫామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ డ్రామా ‘విత్ లవ్’ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం, ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా, తన మొదటి వారంలోనే భారీ వసూళ్లను సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా వసూళ్లు స్థిరంగా ఉన్నాయి. మొదటి రోజున తెలుగులో సుమారు 20 లక్షల రూపాయల వసూళ్లను సాధించిన ఈ చిత్రం, వీకెండ్‌లో పుంజుకుంది. శనివారం 30 లక్షలు, ఆదివారం 36 లక్షల రూపాయలు వసూలు చేసింది. మొదటి సోమవారం 25 లక్షలు, మంగళవారం 21 లక్షల రూపాయలతో తన జోరును కొనసాగించింది. మొత్తం మీద మొదటి 7 రోజుల్లో తెలుగు వెర్షన్ సుమారు 1.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది.సురేష్ ప్రొడక్షన్స్ ఈసినిమాను తెలుగులో విడుదలచేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొదటి వారంలోనే అన్ని భాషలు కలుపుకుని దాదాపు 17 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ నిర్మించిన ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. సినిమాలో కొత్త ముఖాలే ఉన్నప్పటికీ, కథలో ఉన్న స్వచ్ఛత మరియు స్కూల్ జ్ఞాపకాల నేపథ్యంలో సాగే కథాంశం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























