బ్యాండ్ మేళం రిలీజ్ డేట్ ఫిక్స్

Band Melam Release Date Locked

యంగ్ హీరో హర్ష రోషన్ మరియు శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. ‘కోర్ట్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ క్రేజీ జంట మళ్ళీ కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మ్యూజికల్ రోమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను మార్చి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “ఎవ్రీ బీట్ హ్యాజ్ యాన్ ఎమోషన్” అనే ఆసక్తికరమైన ఉపశీర్షికతో వస్తున్న ఈ సినిమాను సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో హర్ష రోషన్ ‘యాదగిరి’ అనే పాత్రలో, శ్రీదేవి ‘రాజమ్మ’ అనే పాత్రలో కనిపిస్తున్నారు.

ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ (బేబీ ఫేమ్) సంగీతం అందిస్తుండగా కావ్య , శ్రావ్య నిర్మిస్తున్నారు. ప్రముఖ రైటర్ కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ లో తెలంగాణ యాసలో సాగే డైలాగులు మరియు జానపద బాణీలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా మేకింగ్ విలువలు మరియు నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.