మన శంకర వర ప్రసాద్ గారు స్ట్రీమింగ్ డేట్ లాక్

Mana Shankara Varaprasad Garu OTT Release Date Confirmed

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ డిజిటల్ సందడికి సిద్ధమైంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు మీ ఇంటికి రాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం వచ్చే బుధవారం అంటే ఫిబ్రవరి 11, 2026 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డిజిటల్ సంస్థ జీ5 ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది.ఈ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ మరియు బెంగాలీ సహా మొత్తం ఏడు భాషల్లో అందుబాటులోకి రానుంది.ఈ విషయాన్ని జీ5 ఆఫీషియల్ గా ప్రకటించింది.

అంతేకాదు ఓటీటీలో వీక్షించే ప్రేక్షకులకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉండబోతోంది. థియేట్రికల్ వెర్షన్‌లో లేని, కోలీవుడ్ నటుడు VTV గణేష్ మరియు చిరంజీవిల మధ్య సాగే ఒక హిలేరియస్ కామెడీ సీక్వెన్స్‌ను ఓటీటీ వెర్షన్‌లో జోడించబోతున్నట్లు సమాచారం.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో మెరిశారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ చిత్రం రూ.375 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.