మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు అనుదీప్ కేవీ కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ మూవీ ‘ఫంకీ’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఫంకీ’ థియేట్రికల్ ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని శ్రీరాములు 70mm థియేటర్లో సాయంత్రం 4 గంటలకు అభిమానుల సమక్షంలో ఈ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. అదే సమయంలో యూట్యూబ్‌లో కూడా ట్రైలర్ అందుబాటులోకి రానుంది.
వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 13, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.ఇందులో విశ్వక్ సేన్ ఒక విభిన్నమైన సినిమా దర్శకుడి పాత్రలో నటిస్తుండగా, ‘డ్రాగన్’ ఫేమ్ కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. అనుదీప్ కేవీ తనదైన మార్కు సెటైరికల్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























