యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న క్రేజీ మోటోక్రాస్ రేసింగ్ డ్రామా ‘బైకర్’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గుడ్ ఫ్రైడే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, భారతదేశంలోనే మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్య చిత్రంగా రానుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను ‘బుల్లెట్ సునీల్‘గా పరిచయం చేస్తూ మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి సంబంధించిన ‘ది రీ-స్టార్ట్’ గ్లింప్స్‌ను ఫిబ్రవరి 4, 2026న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నారు.
ఇందులో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుండగా, రాజశేఖర్ మరియు బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
నిజానికి ఈ సినిమాను 2025 చివరలోనే విడుదల చేయాలని భావించినప్పటికీ, గ్రాఫిక్స్ (CG) పనులు కారణంగా ఏప్రిల్‌కు వాయిదా వేశారు.
ఇక రీసెంట్ గా సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో విజయాన్ని అందుకున్న శర్వానంద్ బైకర్ తో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకువాలని చూస్తున్నాడు. ఈసినిమా కూడా చాలా బాగా వస్తుందని టాక్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























