‘బరాబర్ ప్రేమిస్తా’తో చంద్రహాస్‌కు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా – ఆది సాయి కుమార్

Hero Aadi Sai Kumar Wishes Big Break For Chandrahas with Barabar Premistha Movie

‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్‌ హీరోగా సంపత్ రుద్ర తెరకెక్కించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘మిస్ ఇండియా’ ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 1) నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాన్జీ, ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి, హీరో ఆది సాయి కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. “ప్రభాకర్ అన్నతో నేను ‘నెక్ట్స్ నువ్వే’ మూవీని చేశాను. అప్పుడు నాకు చంద్రహాస్ గురించి ఎక్కువగా చెబుతుండేవారు. మంచి హీరో అవుతాడని అప్పుడే అనుకున్నాను. చంద్రహాస్ పడే కష్టాన్ని చూస్తున్నాను. ఎంతో నిజాయితీగా కష్టపడుతున్నాడు. చంద్రహాస్ మంచి హిట్టు కొట్టాలని అనుకుంటున్నాను. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాతో చంద్రహాస్‌కు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 6న ఈ మూవీని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.