మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ‘ధీరే ధీరే’ శ్రోతలను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఫంకీ’ సినిమాలోని రెండో పాటను రేపు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. భీమ్స్ సిసిరోలియో తనదైన మాస్ మరియు మెలోడీ టచ్‌తో ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించారని సమాచారం.
విశ్వక్ సేన్ ఈ చిత్రంలో ఒక సినీ దర్శకుడి పాత్రలో కనిపించనుండగా సినిమా ఇండస్ట్రీ, మేకింగ్ మరియు లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం అనుదీప్ మార్క్ కామెడీతో ఉండబోతోంది.
ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.ఇందులో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, నరేష్, మురళీధర్ గౌడ్, విటివి గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ఇంటర్వ్యూలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























