శ్రీనివాస మంగాపురం నుండి రషా తడానీ ఫస్ట్ లుక్ రిలీజ్

First Look of Rasha Thadani from Srinivasa Mangapuram Is Out

మంగళవారం తరువాత దర్శకుడు అజయ్ భూపతి నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమా ద్వారా ఈ సినిమాతో సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండగా బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్ గా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తోంది.వీరిద్దరి మధ్య సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమానుండి ఇంతకుముందు జయకృష్ణ ను పరిచయం చేయగా తాజాగా హీరోయిన్ రషా తడానీ ని పరిచయం చేశారు. ఇందులో తను మంగా ‘మంగా’ అనే యువతి పాత్రలో నటిస్తోంది. తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె ఎంతో స్వచ్ఛంగా, అందంగా, పల్లెటూరి ఆహార్యంలో కనిపిస్తూ పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయినట్లు తెలుస్తోంది.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా తిరుమల కొండలు మరియు శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే రస్టిక్ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ సినిమాల తర్వాత అజయ్ భూపతి మరోసారి రా అండ్ రియలిస్టిక్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ప్రముఖ నిర్మాత సి. అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్‌ కుమార్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఈసినిమాను ఈఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.