నటీనటులు : తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా,బ్రహ్మానందం, బ్రహ్మాజీ , సురభి ప్రభావతి
ఎడిటింగ్ :ఆర్ సజీవ్
సినిమాటోగ్రఫీ : దీపక్ యెరగరా
సంగీతం : జై క్రిష్
దర్శకత్వం : ఏఆర్ సజీవ్
నిర్మాతలు : సృజన్ యరబోలు , ఆదిత్య పిట్టి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ తో ఈసినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈసినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి మలయాళ హిట్ ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
రాజమండ్రికి చెందిన శాంతి (ఈషా రెబ్బా) చదువుకోవాలనే కోరిక ఉన్న అమ్మాయి. కానీ పెద్దలు ఆమెకు ఓంకార్ (తరుణ్ భాస్కర్)తో వివాహం చేస్తారు. ఓంకార్ చిన్న విషయానికే కోపం తెచ్చుకుంటూ శాంతిని కొడుతుంటాడు. మొదట్లో మౌనంగా భరించిన శాంతి, ఒకానొక దశలో ఎదురుతిరగాలని నిర్ణయించుకుంటుంది. ఆమె ఎలా తిరగబడింది? కరాటే నేర్చుకుని భర్తకు ఎలా బుద్ధి చెప్పింది? చివరికి వీరిద్దరి బంధం ఏమైంది? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ :
చాలా సింపుల్ స్టోరీని తెర మీదకు అంతే చక్కగా తీసుకరావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమా ప్రారంభం చాలా సరదాగా సాగుతుంది. శాంతి చిన్ననాటి జ్ఞాపకాలు, ఆమె చదువు కోసం పడే ఇబ్బందులను వినోదాత్మకంగా చూపించారు. తరుణ్ భాస్కర్ ఎంట్రీ తర్వాత కథ ఊపందుకుంటుంది. పెళ్లి చూపులు, పెళ్లి సీన్లు రియలిస్టిక్‌గా ఉండటంతో పాటు హాస్యాన్ని పంచుతాయి. భార్యను కొట్టే భర్త పాత్రను కూడా దర్శకుడు నవ్వు పుట్టించేలా డిజైన్ చేయడం విశేషం.
ఇక సెకండ్ హాఫ్ లో శాంతి ఎదురు తిరిగే సన్నివేశాలు థియేటర్‌లో విజిల్స్ వేయిస్తాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా కొత్తగా, ఫన్నీగా ఉంటాయి. భార్యాభర్తల గొడవలను ఒక బాక్సింగ్ మ్యాచ్‌లా చిత్రీకరించడం మేధోతనం. కథలో ఉన్న సందేశం ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటూనే, వినోదాన్ని పండించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఓవరాల్ గా ఓం శాంతి శాంతి శాంతిః డీసెంట్ ఎంటర్టైనర్ అనే ఫీల్ తెప్పిస్తుంది.
నటీనటుల పెర్ఫామెన్స్ :
తరుణ్ భాస్కర్ ‘అంబటి ఓంకార్ నాయుడు’ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయి. ఈషా రెబ్బా ఈ సినిమాతో తనలోని నటిని మరో మెట్టు ఎక్కించింది. అమాయకమైన అమ్మాయిగా, ఆ తర్వాత ధైర్యవంతురాలిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ మరియు ఇతర నటీనటులు తమ పరిధి మేరకు బాగా నటించి నవ్వులు పూయించారు.
సాంకేతిక విభాగం :
జై క్రిష్ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎసెట్. సన్నివేశాలకు అనుగుణంగా వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కామెడీని బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ రాజమండ్రి పరిసరాలను సహజంగా చూపించింది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది, ఎక్కడా బోర్ కొట్టదు. రీమేక్ అయినప్పటికీ, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేసిన మార్పులు బాగా కుదిరాయి.నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా వున్నాయి.
చివరగా .. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ కేవలం నవ్వించే సినిమా మాత్రమే కాదు, ఆలోచింపజేసే చిత్రం కూడా. భార్యాభర్తల మధ్య గౌరవం ఉండాలని, సమానత్వం ముఖ్యమని చాటిచెప్పే ఈ చిత్రం ప్రతి కుటుంబం తప్పక చూడాల్సిన మూవీ. వారాంతంలో సరదాగా గడపాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























