మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ కోసం డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.రీసెంట్ గా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడంతో సినిమాను అనుకున్న తేదీ ఫిబ్రవరి 13కే రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక విలక్షణమైన సినిమా దర్శకుడి పాత్రలో నటిస్తున్నారు.చిత్ర పరిశ్రమపై సాగే ఒక వైవిధ్యమైన సెటైరికల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. నరేష్, విటివి గణేష్, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. వచ్చే వారంలో సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాతో హిట్ కొట్టి విశ్వక్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.అనుదీప్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఫంకీ పై మంచి అంచనాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























