హిలేరియస్ గా హే భగవాన్ టీజర్

Hey Bhagawan Teaser Promises a Hilarious Ride

‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హే భగవాన్’. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ నేడు విడుదలై నవ్వులు పూయిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక రహస్యమైన ‘ఫ్యామిలీ బిజినెస్’ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ వ్యాపారం ఏంటనేది ఎవరికీ చెప్పకూడదనే ఆసక్తికర నిబంధనతో సాగే తండ్రీకొడుకుల ప్రయాణం ఎంతో హిలేరియస్‌గా ఉండబోతోందని టీజర్ ద్వారా తెలుస్తోంది. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌తో పాటు ఆద్యంతం వినోదాన్ని పంచే చిత్రంగా ఇది రూపొందింది.

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ తర్వాత సుహాస్ మరియు శివాని నాగరం ఈ చిత్రంతో మరోసారి జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్ వి.కె మరియు సుహాస్ మధ్య సాగే కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

‘రైటర్ పద్మభూషణ్’ ఫేమ్ షణ్ముఖ ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందించగా, వివేక్ సాగర్ తనదైన శైలిలో సంగీతాన్ని సమకూర్చారు. వెన్నెల కిషోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాను ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఓవరాల్ గా టీజర్, సినిమాపై మంచి అంచనాలు తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో కూడా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.