నందమూరి బాలకృష్ణ తన 111వ చిత్రాన్ని (NBK 111) మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారని తెలిసిందే. రీసెంట్ గానే లాంఛ్ అయ్యింది. అయితే సెట్స్ మీదకు వెళ్లనుంది అనగా చివరి నిమిషంలో బ్రేక్ పడింది.భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా ఈసినిమాను తీయాలని ప్లాన్ చేశారు. హీరోయిన్ గా నయనతార ను ఎంపిక చేశారు. కానీ స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోపోవడంతో ఈకథను పక్కన పెట్టేశారు.దాంతో ఈసినిమా ఆగిపోయిందని అనుకున్నారు.అయితే అలాంటిదేమి లేదట. ఈ కథను మాత్రమే పక్కన పెట్టారు. NBK 111ను మాత్రం గోపిచంద్ మలినేనినే డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ఈసారి పక్కా కమర్షియల్ సబ్జెక్టు తో ఈసినిమా రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా గురించి డైరెక్టర్ గోపిచంద్ మలినేని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో స్పందించారు. NBK 111 పక్కా కమర్షియల్ గా వీరసింహా రెడ్డి ని మించి వుండనుందని మార్చి నుండి సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. అయితే హీరోయిన్ ను మారుస్తారా లేక నయనతారనే కొనసాగిస్తారా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈసినిమాను నిర్మించనుండగా థమన్ సంగీతం అందించే ఛాన్స్ వుంది. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇక ‘వీరసింహారెడ్డి’ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ – గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో NBK 111 పై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























